తెలుగు సినిమా ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిమ్స్ తీసి డైరెక్టర్ గా పరిచయమైన దర్శకుడు సుజీత్.( Director Sujeeth ) శర్వానంద్ తో తీసిన “రన్ రాజా రన్” సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈయన మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత ప్రభాస్ తో సాహో అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంసలనైతే అందుకున్నాడు.ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓ జి సినిమా( OG Movie ) చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉండగానే నానితో( Nani ) మరొక ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేశాడు.ఇక ప్రస్తుతం నాని ప్రాజెక్టు మీద తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్రీ అవుతాడు.అప్పటి వరకు తను నాని సినిమా మీదనే వర్క్ చేయబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నాని ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన అయితే బాలీవుడ్ లో కూడా మార్కెట్ పరంగా బాగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు అతన్ని రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అజయ్ దేవగన్( Ajay Devgan ) ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు అనేది అధికారికంగా తెలియనప్పటికీ తను మాత్రం ఈ సినిమాలో నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక నానికి పాన్ ఇండియాలో అంత పెద్ద మార్కెట్ అయితే లేదు.కాబట్టి అజయ్ దేవగన్ ఉంటే ఆయన ద్వారా కలెక్షన్స్ అనేవి ఈజీగా వస్తాయి అనే ఉద్దేశ్యంతోనే తను అలా చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.