కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు...

మోహన్ బాబు( Mohan Babu ) ఒకప్పుడు నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఏదో ఒక రకమైన వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుండేవాడు.

 Manchu Vishnu Gave Clarity On Kannappa Movie Release Date Details, Manchu Vishnu-TeluguStop.com

ఇక ఇట్లాంటి క్రమం లోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు( Manchu Vishnu ) మాత్రం తన కెరియర్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ వాటిలో ఏ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాయి.

ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సక్సెస్ ఒకటి కూడా లేదు అంటే ఆయన చేసే సినిమాల క్వాలిటీ అనేది ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఆయన కన్నప్ప( Kannappa ) అనే ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్లు బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా మొత్తం స్టార్ కాస్టింగ్ తో నింపేస్తున్నాడు.

 Manchu Vishnu Gave Clarity On Kannappa Movie Release Date Details, Manchu Vishnu-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్, మధుబాల లాంటి దిగ్గజ నటీనటులు ఉన్నప్పటికీ అక్షయ్ కుమార్( Akshay Kumar ) లాంటి నటుడు కూడా ఈ సినిమాలో వచ్చి చేరాడు.ఇక ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా లేదా అని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇప్పటికే విష్ణు ఈ సంవత్సరం చివరికల్లా ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ను బట్టి చూస్తుంటే ఇప్పుడు అప్పుడే ఈ సినిమా పూర్తి అయ్యేలా కనిపించడం లేదు.

ఇక 2024 లో ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే 2025 సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube