బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేయలేదని మండిపడ్డారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరారని విమర్శించారు.
బీజేపీకి( BJP ) ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందన్నారు.మోదీ ( Modi ) మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు.ఈ క్రమంలోనే పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.