మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు..: సీఎం రేవంత్

బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేయలేదని మండిపడ్డారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

డీకే అరుణ ఢిల్లీ సుల్తానుల పంచన చేరారని విమర్శించారు.బీజేపీకి( BJP ) ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుందన్నారు.

మోదీ ( Modi ) మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు.

ఈ క్రమంలోనే పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.