టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) తండ్రి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా రాంచరణ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి చెప్పడం వల్ల రామ్ చరణ్ రెండు మంచి సినిమాలు మిస్ అయ్యారట.ఇంతకీ ఆ సినిమాలు ఏవి చిరంజీవి ఆ సినిమాలను ఎందుకు రిజెక్ట్ చేశారు అన్న వివరాల్లోకి వెళితే.
అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమా( Gangotri Movie ) మొదట రామ్ చరణ్ కి ఆఫర్ వచ్చినప్పటికీ చిరంజీవి ఆపర్ ను వద్దు అని చెప్పారట.
ఎందుకంటే అప్పటికి రాంచరణ్ కు సరిగా నటన రాకపోవడం, నటనలో శిక్షణ ఇంకా తీసుకోకపోవడంతో చిరంజీవి గారు రాంచరణ్ తో వద్దు అల్లు అర్జున్తో సినిమా తీయండి అని సలహా ఇచ్చారట.అదేవిధంగా నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా( Josh Movie ) కూడా రామ్ చరణ్ చేయాల్సి ఉంది.కానీ ఆ సినిమా స్టోరీ విన్న చిరంజీవి అందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి అని అందులోనూ మగధీర లాంటి పెద్ద సినిమా చేస్తున్న రాంచరణ్ కు ఈ సినిమా సెట్ అవ్వదు అని మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాను కూడా రిజెక్ట్ చేశారట.
ఆ విధంగా చిరంజీవి చెప్పడంతో రామ్ చరణ్ ఈ రెండు మంచి సినిమాలను మిస్ అయ్యారు.