శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఎంత వద్దనుకున్నా.అధికంగా బరువు పెరిగిపోతుంటారు.
ఫలితంగా బట్టలు పట్టకపోవడమే కాదు.అందహీనంగా కూడా కనిపిస్తాయి.
పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా చుట్టేస్తుంటాయి.అందుకే శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే బాడీ కొవ్వును తగ్గించడంలో మందారం ఆకులు అద్భుతంగా సమాయపడతాయి.
సాధారణంగా మందారం ఆకులను చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు మాత్రమే ఉపయోగిస్తుంటారు.
కానీ, ఆరోగ్యానికి కూడా మందారం ఆకులు ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి.
ముఖ్యంగా శరీరంలో కొవ్వును కరిగించి వెయిట్ లాస్ అయ్యేలా చేయడంలో మందారం ఆకులు గ్రేట్‌గా సహాయపడతాయి.మరి మందారం ఆకులను ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రెష్‌గా ఉండే కొన్ని మందారం ఆకులను తీసుకుని శుభ్రం చేసి.వాటర్‌లో వేసి బాగా మారిగించాలి.అలా మరిగిన నీటిని వాడబోసి.అందులో కొద్దిగా తేనె కలిపి సేవించాలి.ఒక కప్పు చప్పున ప్రతి రోజు ఈ మందారం ఆకుల వాటర్ తీసుకుంటే.క్రమంగా కొవ్వు కరుగుతుంది.
బరువు తగ్గుతారు.అలాగే ఈ మందారం ఆకుల వాటర్ తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.అలసట, నీరసం, తలనొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
మందారం ఆకుల్లో విటమిన్ సీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల, మందారం ఆకుల వాటర్ తీసుకుంటే.శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మరియు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇక మందారం ఆకులతో తయారు చేసిన వాటర్ తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది.
.