బాలీవుడ్‌ సినిమాలను పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు.. మళ్లీ అదే సీన్‌ రిపీట్‌

మరోసారి హిందీ సినిమాకు తెలుగు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం ఎదురు అయ్యింది.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పఠాన్ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధించడం లో విఫలం అయ్యింది.

 Sharukh Khan Movie Pathan Telugu States Collections Details, Hindi Movie , Patha-TeluguStop.com

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ హీరోగా రూపొందిన పఠాన్ సినిమా మొత్తంగా ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.అందులో కనీసం 25 కోట్ల రూపాయల వసూళ్లు కూడా తెలుగు బాక్సాఫీస్‌ నుండి కాదు అనే విషయం తెల్సిందే.

తెలుగు సినిమా లు ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తే బాలీవుడ్‌ బాక్సాఫీస్ నుండి మినిమంగా వంద కోట్ల వసూళ్లు వచ్చి ఉండేవి.కానీ తెలుగు బాక్సాఫీస్ వద్ద హిందీ సూపర్‌ హిట్ సినిమా మినిమం వసూళ్లు సాధించలేక పోయింది.

పఠాన్ సినిమాను తెలుగు లో రామ్‌ చరణ్ ప్రమోట్‌ చేయడం జరిగింది.రామ్‌ చరణ్ తెలుగు ట్రైలర్‌ ను షేర్ చేయడం తో పాటు ఆల్ ది బెస్ట్‌ చెప్పాడు.

అంతే కాకుండా పఠాన్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది.

Telugu Hindi, Pathan, Pathan Telugu, Ram Charan, Sharukhkhan, Telugu Audience-Mo

బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పఠాన్ సినిమా తెలుగు లో మినిమం వసూళ్లు సాధించినా గౌరవ ప్రథంగా ఉండేది.కానీ పఠాన్ సినిమా మాత్రం షారుఖ్‌ ఖాన్‌ కి తెలుగు రాష్ట్రాల్లో కనీస వసూళ్లు నమోదు చేయక పోవడం తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి రక్త కన్నీరు అన్నట్లుగా ఉంది.

Telugu Hindi, Pathan, Pathan Telugu, Ram Charan, Sharukhkhan, Telugu Audience-Mo

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో కూడా మినిమం వసూళ్లు సాధించలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో పఠాన్ సినిమా గురించి పెద్ద ఎత్తున హడావుడి చేసినా కూడా చివరకు మినిమం వసూళ్లు టాలీవుడ్‌ లో రాబట్టలేక పోయింది.ఆ మధ్య విడుదల అయిన లాల్ సింగ్ చడ్డా కూడా నిరాశ పర్చింది.

అంతకు ముందు వచ్చిన బాలీవుడ్‌ సినిమా ల యొక్క కలెక్షన్స్ కూడా నిరాశే మిగిల్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube