బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఎన్నికల ప్రచారానికి గానూ ధర్మపురి వెళ్తుండగా చల్ గల్ చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేశారు.
కవిత వాహనంతో పాటు ఇతర వాహనాలు అన్నింటినీ పోలీసులు చెక్ చేశారు.కాగా అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వాహనాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే సాధారణ వ్యక్తుల వాహనాలతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెహికల్స్ లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.







