దిల్ రాజు నిర్మాణంలో ఒక వైపు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు రూపొందుతున్నాయి.ఆ సినిమాలు ఎంత వరకు విజయాలను సొంతం చేసుకుంటాయి.
ఎంతగా వసూళ్లు నమోదు చేస్తాయి అనే విషయంలో క్లారిటీ లేదు.కానీ ఇటీవల ఆయన నిర్మాణ సంస్థ నుండి వచ్చిన బలగం సినిమా(Balagam movie) కేవలం రెండు వారాల్లో ఏకంగా మూడు రెట్ల లాభాలను తెచ్చి పెట్టింది.
పెట్టిన పెట్టుబడికి ఏకంగా మూడు రెట్ల లాభాలను దిల్ రాజు(Dil raju) దక్కించుకున్నాడు.ముందు ముందు మరింతగా లాభాలు రాబోతున్నాయి.
బలగం సినిమా దక్కించుకున్న సక్సెస్ కారణంగా నాన్ థియేట్రికల్ రైట్స్ తో కూడా భారీ మొత్తంలో లాభాలను దిల్ రాజు దక్కించుకునే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా దక్కించుకున్న కలెక్షన్స్ ని చూస్తూ ఉంటే స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ స్థాయిలో లాభాలను పొందుతాయా అంటూ చర్చ జరుగుతోంది.కొన్ని సార్లు అద్భుతాలు ఆవిష్కారం అవుతాయి.ఆ అద్భుతం బలగం విషయంలో జరిగింది.
లాంగ్ రన్ కలెక్షన్స్ 30 కోట్లు దక్కితే మరో పది కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది.కనుక ఒక అద్భుతమైన సినిమాకు భారీ లాభాలు దక్కే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బలగం సినిమాకు జబర్దస్త్ వేణు (Director venu) దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కనిపించాడు.తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.కుటుంబ విలువలు మరియు బంధాల గురించి సినిమాను చూపించారు.దిల్ రాజు ఇలాంటి ఒక కథ ను నమ్మి నిర్మించేందుకు ముందుకు రావడం అంటే కచ్చితంగా ఆయన ధైర్యంకు మెచ్చుకోవాల్సిందే.ప్రతి సారి కూడా దిల్ రాజు తన కథ ఎంపిక గురించి ప్రశంసలు దక్కించుకుంటూనే ఉంటాడు.
ఈ సారి బలగం తో మళ్లీ దాన్ని నిరూపించుకున్నాడు.







