ఏపీలో రాజకీయ వేడి మండే ఎండలను సైతం చిన్నబుచ్చుతుంది.మండుతున్న ఎండలను సైతం లెక్కపెట్టకుండా ప్రముఖ నాయకులు అంతా కూడా రోడ్డున పడి మరీ ప్రచారం చేస్తున్నారు.
ఈ సమయంలోనే ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న సంజన గురించి అంతా కూడా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.కేవలం ఏపీలోనే కాకుండా ఈమె గురించి తెలంగాణలో కూడా చర్చ జరుగుతుంది.
ఎందుకంటే ఆమె బిగ్‌బాస్ పార్టిసిపెంట్ కనుక.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో సామాన్యురాలి కోటాలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంది.అయితే వారం రోజుల్లోనే ఆమెకు నిరాశ మిగిలింది.ప్రేక్షకులు ఆమెను వారంలోనే తిరష్కరించారు.
సంజన వారం రోజులో ఉన్నా కూడా చాలా బలమైన ముద్రను ప్రేక్షకుల్లో వేసింది.ఆమె చేసిన హంగామాతో సీజన్ మొత్తం కూడా వివాదాలతోనే కొనసాగింది.
అలాంటి సంజన రాజకీయాల్లోకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
బిగ్‌బాస్ నుండి బయటకు వెళ్లిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి చూపించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంది.ఆ సమయంలోనే ఆమె తన సొంత ప్రాంతం అయిన నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేయాలని భావించింది.కాంగ్రెస్ తరపున ఈమె సీటు ఆశించింది.
అయితే కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ సీటు ఆమెకు దక్కలేదు.స్థానికంగా సంజన తండ్రికి రైతుగా మంచి పేరు ఉంది.
అలాంటి రైతు కూతురు అవ్వడం వల్ల సంజనకు బాగానే ఓట్లు పడే అవకాశం ఉందని, అయితే టీడీపీ మరియు వైసీపీల మద్య ఉన్న పోటీ కారణంగా సంజన గెలుపు అనేది కష్టమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.