ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యనటలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.పార్టీకి నిస్వార్థ సేవలు అందిస్తున్న దివ్యాంగుడైన బీజేపీ కార్యకర్తతో మోదీ స్వయంగా సెల్ఫీ తీసుకున్నారు.
ఆ ఆనంద క్షణాలను ప్రధాని ట్వీట్ చేశారు.ప్రత్యేక సెల్పీ ఇది.చెన్నైలో నేను ఎస్.మణికందన్ ను కలుసుకున్నాను.ఈ రోడ్డుకు చెందిన ఆయన ఎంతో గర్వించదగిన కార్యకర్త.బూత్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు.దివ్యాంగుడైన ఆయన సొంతంగా దుకాణం నడుపుకుంటూ రోజువారి లాభాల్లో గణనీయమైన మొత్తాన్ని పార్టీకి అందిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు’ అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.