బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న పూరీ.. నటసింహం ఛాన్స్ ఇస్తారా?
TeluguStop.com
టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నారు.
ఒకప్పుడు పూరి సినిమాలు వస్తున్నాయి అంటే ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేవారు అంతలా ఈయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించేవి కానీ ఇటీవల కాలంలో పూరి మార్క్ తన సినిమాలలో కనిపించడం లేదని తెలుస్తోంది.
ఇక తాజాగా ఈయన రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్( Double Ismart ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
"""/" /
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది.
పూరి తన సినిమాల విషయంలో ముందు ఉన్న కంటెంట్ ఇప్పుడు అందించలేకపోతున్నారని అభిమానులు కూడా ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పూరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంపై అందరూ ఆరా తీస్తున్నారు.
"""/" /
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం నందమూరి నటసింహం బాలయ్యతో( Nandamuri Balakrishna ) చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పటికే రావాల్సి ఉండగా పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది.
లైగర్ సినిమా తర్వాత బాలయ్యతో పూరి సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం మాత్రం బాలకృష్ణ కోసం పూరి జగన్నాథ్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను బాలకృష్ణతో పూరి జగన్నాథ్ చర్చలు జరుపబోతున్నారని తెలుస్తుంది.
మరి పూరి జగన్నాథ్ కు బాలయ్య చాన్స్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కథలో కంటెంట్ ఉంటే బాలయ్య ఏ డైరెక్టర్ కైనా అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.
మరి పూరి జగన్నాథ్ తన సినిమా కథతో బాలకృష్ణను మెప్పించగలరా అన్న విషయం తెలియాల్సి ఉంది.
మోచేతులు, మోకాళ్లు తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!