మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.ప్లోర్ టెస్ట్ లేకుండానే ఉద్దవ్ సీఎం పదవికి రాజీనామా చేశారన్న సుప్రీంకోర్టు తిరిగి ఉద్దవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని తెలిపింది.
ఈ క్రమంలోనే స్పీకర్ పాత్రను నిర్ణయించేందుకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
గవర్నర్ విచక్షణాధికారం చట్టం ప్రకారం లేదని చెప్పింది.రాజకీయ పార్టీల వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవద్దని పేర్కొంది.
ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది.ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత గడువులో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.







