ఏ పార్టీలో చేరకుండానే అందరినీ టెన్షన్ పెడుతున్న 'ముద్రగడ '

మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

 Mudragada Padmanabham Joining In Which Political Party Details, Janasena, Pavan-TeluguStop.com

దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారు ? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు ఎంపీ , ఎమ్మెల్యే సీట్లలో దేనిని ఎంచుకుంటారు అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది.చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ముద్రగడ ఇప్పుడు యాక్టివ్ కాబోతుండడం,  రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతుండడం ఆసక్తి రేపుతోంది అయితే ముద్రగడ ఏ పార్టీలో చేరుతారు అనేది క్లారిటీ లేకపోవడంతో అన్ని పార్టీలు ఆయన నిర్ణయం పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటికే తుని రైల్వే దహనం కేసును కోర్టు కొట్టి వేయడంతో, పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన టిడిపిలో( TDP ) చేరే అవకాశం లేకపోవడంతో జనసేన, బీజేపీ, వైసీపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారనే విషయం అర్థమవుతుంది.

ఈ మేరకు ఈ మూడు పార్టీల నుంచి ముద్రగడకు భారీగానే ఆఫర్లు వస్తున్నాయట.జనసేన ( Janasena ) టిడిపి తో పొత్తు పెట్టుకోకుండా బిజెపితో కలిసి ఎన్నికలకు వెళితే జనసేనలో ముద్రగడ చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది .

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan

ఇక అధికార పార్టీ వైసిపి కూడా మొదటి నుంచి ముద్రగడ విషయంలో సానుకూలంగానే ఉంది.టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ అమలు చేయాలని ముద్రగడ ఉద్యమం చేపట్టిన సమయంలోను వైసిపి ఆయనకు ప్రత్యక్షంగాను , పరోక్షంగాను మద్దతు ఇచ్చింది.2019లో వైసిపి గెలిచిన దగ్గర నుంచి అనేక విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ముద్రగడ లేఖలు రాశారు.దీంతో ముద్రగడ వైసీపీలోని ఇప్పుడు చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఆయన గనుక వైసిపి కండువా కప్పుకుంటే కాకినాడ ఎంపీ సీటు లేదా రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు,  అలాగే ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు వైసిపి సిద్ధమవుతోందట.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Janasenani, Kapu, Pavan Kalyan

కానీ ముద్రగడ మాత్రం ఇంకా తన నిర్ణయం ఏమిటి అనేది ప్రకటించలేదు.ఇదే విషయంపై తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారట.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఉపయోగ గోదావరి జిల్లాలతో పాటు,  కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం కాబోతుండడంతో,  ఆ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న ముద్రగడను చేర్చుకుంటే తమకు తిరుగు ఉండదనే ఆలోచనతో అన్ని పార్టీలు ఉన్నాయి.

దీంతో ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేది అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube