ప్రేమ ఎవరి మీద ఎప్పుడు పుడుతుందో చెప్పడం కష్టం.ప్రేమకు కుల మతాలు, ఆస్తి అంతస్థులు, రంగు రూపు అస్సలు అడ్డుకాదు.
ఎవరు ఎవరితోనైనా ప్రేమలో పడొచ్చు.ఇందుకు సినీ సూపర్ స్టార్స్ సైతం అతీతులు కాదు.
తమను ఇష్టపడ్డ ప్యాన్స్ తో ప్రేమలో పడి వారినే తన జీవిత భాగస్వాములుగా మార్చుకున్నారు.ఇంతకీ తమ అభిమానులను పెళ్లి చేసుకున్న సినీ నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రజనీకాంత్:

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ సతీమణి లతా.వీరిద్దరి పరిచయం అనుకోకుండా జరిగింది.తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో ఆయన లవ్ లో పడ్డారు.లత కాలేజీ విద్యార్థిగా ఉండగా రజనీని ఇంటర్వ్యూ చేసింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
విజయ్:

తమిళ నటుడు విజయ్ ని తన ప్యాన్ అయిన సంగీత ఒక షూటింగ్ లో కలిసింది.విజయ్ పై, విజయ్ నటనపై తను చెప్పిన మాటలు ఎంతో నచ్చాయి.అప్పుడే సంగీతకు తన ఆటో గ్రాఫ్ తో పాటు ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
మాధవన్:

లవర్ బాయ్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మాధవన్.తన భార్య సరితను తొలిసారి కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ లో కలిశాడు.మాధవ్ హీరోగా రాకముందు తను కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులు చెప్పేవాడు.అక్కడ తన స్టూడెంట్ గా ఉన్న సరిత.మాధవన్ తో ప్రేమలో పడింది.అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఈషా డియోల్:

ఈషా డియోల్ కూడా తన అభిమానినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. భరత్ తక్తాని అనే వ్యాపారవేత్త ఈషాకు పెద్ద అభిమాని.ఒకసారి తను కలిసినప్పుడు ఈ విషయం చెప్పాడు.తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
రాజేష్ కన్నా:

బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ కన్నా సైతం తన అభిమాని డింపుల్ కపాడియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.బాలీవుడ్ లో అడుగు పెట్టిన తొలి ఏడాదిలోనే డింపుల్ రాజేష్ ను పెళ్లి చేసుకుంది.అప్పటికే రాజేష్ సినిమాలు చేయడం మానేశాడు.వారికి పుట్టిన కూతరు ట్వింకిల్ కన్నా.