గుండె నిండా బాధ.. అయినా అభిమానులను మర్చిపోని ప్రభాస్.. ఇంత మంచితనమా?

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన ఒక హీరోగానే కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Heart Full Of Pain But Prabhas Who Doesnt Forget His Fans Is He So Good, Prabhas-TeluguStop.com

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు ఈ డార్లింగ్.మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు పరిమితమైన ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.ఇక ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఆయన సరసన నటించిన నటులు ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు తెలుపుతుంటారు.

ఇంత స్టార్ రేంజ్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని ఫీల్ అవ్వడు ప్రభాస్.ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు అనే హోదా తో కాకుండా మంచి స్నేహితుడిగా ఉంటాడు ప్రభాస్.

మేకప్ మాన్ నుండి ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా అభినందిస్తాడు.ఇక తన ఇంటి నుండి తయారుచేసిన అభిరుచులను కూడా షూటింగ్ లో ఉన్నవారికి రుచి చూపిస్తుంటాడు.

నిజానికి ఆహారం విషయంలో రకరకాల రుచులు చూపిస్తుంటారట ప్రభాస్ కుటుంబం.ప్రభాస్ ఇంట్లో గోదావరి వంటకాలు చాలా ఫేమస్ అట.

ఇక తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి తమ ఇంటి రుచులను చూపిస్తుంటాడు.

గతంలో చాలా మంది టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నటినటులకు తమ ఇంటి వంట రుచులను పరిచయం చేశాడు.

ఇదివరకు తన సినిమాల్లో నటించిన చాలామంది నటీనటులకు తన ఇంటి భోజన రుచులు చూపించాడు ప్రభాస్.అలా ఇప్పటికీ చాలామంది సెలబ్రెటీలు ప్రభాస్ ఇంటి రుచులు చూశారు.

సెట్ లోనే కాకుండా సెలబ్రేటీల ఇళ్లలకు కూడా పంపిస్తూ ఉంటాడు.

షూటింగ్ లో ఉన్నవారికి తమకు నచ్చిన ఫుడ్ ను అడిగిన వెంటనే పార్సిల్ రూపంలో తమ ఇంటికి పంపిస్తుంటాడు.

ఇక కష్టాలో ఉన్నప్పుడు కూడా ప్రభాస్ కడుపు నిండా భోజనం పెట్టె మంచి మనసున్న రారాజు అని చెప్పాలి.ఎందుకంటే ఇప్పుడు పుట్టడు శోకంతో ఉన్న ప్రభాస్ ఎంతోమందికి భోజనాలు ఏర్పాటు చేశాడు.

తన పెద్ద నాన్న అయినా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది.ఇక ప్రభాస్ గుండె బరువెక్కింది.తనతో కలిసి నటించే తన పెద్ద నాన్న ఇక లేరు అని తెలియటంతో జీర్ణించుకోలేకపోయాడు.ఇక అంత బాధ గుండెల్లో పెట్టుకున్న కూడా అంత్యక్రియలకు వచ్చిన ఆయన అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టి పంపాడని తెలిసింది.

కృష్ణంరాజు అంతిమయాత్రకు భారీ ఎత్తుగా ఫ్యాన్స్ తరలిరావడంతో వచ్చిన ఫ్యాన్స్ అందరూ తినేసి వెళ్లాలి అంటూ ప్రభాస్ భోజనం ఏర్పాట్లు చేయించాడట.

ఇక ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.మనసున్న మారాజు డార్లింగ్ ప్రభాస్.రాజు ఎక్కడున్నా రాజే అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.ప్రభాస్ అంత బాధలో ఉన్నా కూడా తన ఫ్యాన్స్ ని అస్సలు మర్చిపోకుండా తన మంచితనంతో అందరు కడుపు నింపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube