కుతుబ్ మినార్ పైన ఎప్పటినుండి ఓ చర్చ వాడివేడిగా జరుగుతోంది.అదే అక్కడ హిందూ దేవాలయాలు వున్నాయంటూ ఓ వాదన వినిపిస్తోంది.
ఇక్కడ ఈ కాంప్లెక్సులో 27 హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయని, వీటిని మరలా పునరుద్ధరించి ఇక్కడ హిందూదేవుళ్ళను రూపొందించాలని హిందూ సంఘాలు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాయంటూ వార్తలని మనం చూస్తూ వున్నాం.అయితే ఈ వివాదం తిరిగి కోర్టుకెక్కడం చూస్తే ఇది నిజమేననిపిస్తుంది.
కుతుబ్ మినార్ తనదేనంటున్న ఓ వ్యక్తి.ఈ కాంప్లెక్సు లోని 27 హిందూ, జైన దేవాలయాలను పునరుద్దరించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఢిల్లీ లోని సాకేత్ కోర్టును ఆశ్రయించాడు.
విషయమేమంటే, ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ మంగళవారం విచారణ ప్రారంభించింది.తాను రాచరిక వంశస్థుడినని, కుతుబ్ మినార్ కట్టిన స్థలం తనదేనని ఆయన వాదన.1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తన ఈ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించుకుందని, ఆయన తన పిటిషన్ లో పేర్కోవడం కొసమెరుపు.చట్టరీత్యా సదరు భూమి యజమానిని నేనేనని.
కేంద్రానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై హక్కు లేదని అంటున్నాడు.పైగా ఆగ్రా నుంచి మీరట్, అలీగఢ్, బులంద్ షహర్, గుర్ గావ్ వరకు గల యమునా, గంగా నదుల తీర ప్రాంతాలు కూడా తనవేనని అనడంతో కథ రసవత్తరంగా మారింది.

ఔట్ దీని ఓనర్ షిప్ అంశం అనేది ప్రస్తుతం కీలకంగా మారింది.ఇక్కడి స్థల యజమాని భూ సమస్య పరిష్కారమయ్యేవరకు ఆలయాల పునరుద్ధరణ జరగాలన్న పిటిషన్ పై విచారణ సాధ్యం కాదని లోగడ కోర్టు స్పష్టం చేసిన సంగతి విదితమే.ఇప్పుడు ఈ స్థలం తనదేనని తనను రాచరిక వంశస్థుడిగా చెప్పుకొంటున్న వ్యక్తి పిటిషన్ వేశాడు గనుక కోర్టు దీనిపై దృష్టి పెట్టింది.వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో నిన్న అక్కడి కోర్టు హిందూ సంఘాలకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో.
కుతుబ్ మినార్ కేసుకు కూడా అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది అనడంలో అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఏమవుతుందో?







