విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
బోట్లు దగ్ధమైన ఘటనలో నాని ప్రమేయం లేదని కుటుంబ సభ్యులు పిటిషన్ లో పేర్కొన్నారు.
అయినా పోలీసులు నానిని ఇబ్బంది పెడుతున్నారని పిటిషన్ లో తెలిపారు.అయితే బోట్లు దగ్ధమైన ఘటనలో లోకల్ బాయ్ నానిని పోలీసులు అనుమానితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే.