పెళ్లి సందడి రీమేక్ ? శ్రీకాంత్ కొడుకుతో !

శ్రీకాంత్ కొడుకు ‘రోషన్’ కథానాయకుడిగా ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా రూపొందుతోంది.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

 Srikanth Son Interested In Pelli Sandadi Remake-TeluguStop.com

చాలావరకూ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో వున్నారు.


ఇదిలా వుండగా, రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమా మరోమారు తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా ‘పెళ్లి సందడి’ నిలిచింది.మ్యూజికల్ హిట్ అనిపించుకోవడమే కాకుండా, శ్రీకాంత్ కెరియర్ స్పీడ్ ను పెంచింది.


అలాంటి ఆ సినిమాను రోషన్ తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.రోషన్ రెండవ సినిమాగా గానీ .మూడవ సినిమాగా గాని, ఈ రీమేక్ వుండే అవకాశం వుందని అంటున్నారు.అదే నిజమైతే .ఇది మంచి ప్రయత్నమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube