యంగ్ హీరో నాని ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 2కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెల్సిందే.
మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్ హోస్టింగ్‌కు మంచి పేరు దక్కింది.రెండవ సీజన్ అనగానే అందరి అంచనాలు పెరిగాయి.
అయితే నాని హోస్టింగ్ అనగానే కాస్త ఆలోచించారు.ఎన్టీఆర్ రేంజ్‌లో ఆకట్టుకోగలరా అంటూ అంతా అనుకున్నారు.
కాని అనూహ్యంగా నాని హోస్ట్‌గా మొదటి రెండు వారాలు ఇబ్బంది పడ్డా కూడా ఆ తర్వాత తేరుకున్నాడు.
ఇంటి సభ్యులతో ఆయన ఇంటారాక్ట్ అవ్వడం మరియు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో నాని హోస్టింగ్ పర్వాలేదు అన్నట్లుగా సాగుతుంది.అయితే హిందీ బిగ్‌బాస్‌లో సల్మాన్ ఖాన్ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే వారిపట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు.తమిళ బిగ్‌బాస్‌లో కూడా కమల్ తప్పు చేసిన వారితో, తప్పుగా మాట్లాడిన వారి విషయంలో చాలా కఠినంగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది.
కాని తెలుగు బిగ్‌బాస్‌లో మాత్రం నాని ఆ విషయంలో విఫలం అయ్యాడు.నాని ఏమాత్రం ఇంటి సభ్యులతో కఠువుగా ఉండటం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తేజస్వి ఆమద్య బండ బూతులు తిట్టడంతో పాటు, ఒక మహిళగా ప్రవర్తించలేదు.అయినా కూడా నాని ఏమాత్రం ఆమెను మందలించలేదు.
ఏదో పై మాటలకు నీ పద్దతేం బాగా లేదు అంటూ ఆమెను కాస్త హెచ్చరించాడు.నాని ఆమె పట్ల కఠినంగా ఉండకపోయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఆమె తీరుపై కఠినంగా వ్యవహరించారు.
ఆమెను ఎలిమినేట్ చేశారు.ఇక బాబు గోగినేని విషయంలో కూడా నాని సాఫ్ట్ కార్నర్‌ను కనబర్చాడు.
ఆయన ఇంట్లోంచి కౌశల్ మరియు గీతా మాధురిలను బయటకు పంపిస్తాను అంటూ చెప్పాడు.సహజంగా అయితే ఆ వీడియోను చూపించి, ఇదేం పద్దతని సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి.
కాని నాని అలా చేయలేదు.
నాని కొందరిపై ఫేవరిజం చూపిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో మొదటి నుండి కూడా కొందరు నాని హోస్టింగ్‌పై విమర్శలు చేస్తున్నారు.ఇప్పుడు ఆ కొందరు కాస్త మరింతమంది అయ్యారు.
బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా నాని అనర్హుడు అంటూ సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ మొదలైంది.ఆ హ్యాష్ ట్యాగ్ ఏకంగా హైదరాబాద్ ట్రెండ్స్‌లో స్థానం దక్కించుకుంది అంటే ఏ స్థాయిలో నాని హోస్టింగ్‌కు వ్యతిరేకంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నాని హోస్టింగ్‌పై ముందు ముందు ఎన్ని విమర్శలు వస్తాయో చూడాలి.