చిన్నగా ఉన్నాయని రాస్ బెర్రీలను చిన్న చూపు చూడొద్దు.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

బెర్రీ పండ్లలో రాస్ బెర్రీ( Ross Berry ) ఒకటి.అయితే చిన్నగా ఉన్నాయని రాస్ బెర్రీలను చిన్న చూపు చూస్తే పొరపాటే అవుతుంది.

 Wonderful Health Benefits Of Raspberry Fruits! Raspberries, Raspberries Health B-TeluguStop.com

చిన్నగా ఉన్నా రాస్ బెర్రీలు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి.అలాగే విటమిన్ సి, విట‌మిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ ఇ, విట‌మిన్ బి, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, మెగ్నీషియం, పొటాసియం, ఐర‌న్‌, కాప‌ర్ వంటి పోష‌కాలతో పాటు శ‌క్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సైతం రాస్ బెర్రీ పండ్ల‌లో పుష్క‌లంగా నిండి ఉంటాయి.

అసలు వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.రాస్ బెర్రీలు సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు లభిస్తాయి.నిత్యం గుప్పెడు రాస్ బర్రీ పండ్ల‌ను తీసుకుంటే కంటి ఆరోగ్యం( Eye health ) బాగుంటుంది.చూపు రెట్టింపు అవుతుంది.

రాస్ బర్రీల‌ను తీసుకుంటే వయసు పైబ‌డిన కళ్ళద్దాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.

Telugu Tips, Latest, Benefits-Telugu Health

నిత్యం రాస్‌ బెర్రీలను తీసుకుంటే మధుమేహం( diabetes ) వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.రాస్ బెర్రీలు మెదడు యొక్క చురుకుతనాన్ని పెంచుతాయి.ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు చేస్తాయి.

అలాగే రాస్ బెర్రీ పండ్లను ప్ర‌తి రోజూ గుప్పెడు చొప్పున తీసుకుంటే బాడీలో పేరుకుపోయిన‌ వ్యర్ధాలు తొలగిపోతాయి.క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

గుండె పోటుతో సహా వివిధ రకాల గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

Telugu Tips, Latest, Benefits-Telugu Health

రాస్‌ బెర్రీ పండ్లు డైట్ లో ఉంటే వెయిట్ లాస్ అవుతారు.ఇమ్యూనిటీ సిస్టమ్‌ బూస్ట్ అవుతుంది.చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా మెరుస్తుంది.

అంతేకాదు ఈ పండ్లు పురుషుల్లో సంతానోత్పత్తి, టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచుతాయి.లైంగిక స‌మ‌స్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

మహిళల్లో గర్భస్రావం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.మరియు పిండం ఎదుగుదలకు సైతం తోడ్పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube