అంతరిక్షం నుంచి మక్కా ఎలా ఉంటదో తెలుసా.. ఈ వీడియో చూడండి!

Astronaut Catches Makkah From Space Video Viral Details, Rayyanah Barnawi, Saudi Arabian Astronaut, Makkah, International Space Station, Grand Mosque, Nanomaterials, Drug Delivery, Tissue Engineering, Makkah From Space

సౌదీ అరేబియాలోని మక్కా( Makkah ) ముస్లింలకు చాలా ముఖ్యమైన నగరం.మహమ్మద్ ప్రవక్త అక్కడ జన్మించినందున ముస్లింలు దీనిని పవిత్ర స్థలంగా భావిస్తారు.

 Astronaut Catches Makkah From Space Video Viral Details, Rayyanah Barnawi, Saudi-TeluguStop.com

ముస్లింలు హజ్ యాత్రకు( Hajj ) వెళ్లే ప్రదేశం కూడా మక్కానే.మక్కాలో అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ భవనం గ్రాండ్ మాస్క్యూ ఉంటుంది.

ఇందులోని కాబా అనేది ముస్లింలు ప్రార్థన చేసేటప్పుడు కనిపించే ఒక చిన్న నల్లని భవనం.హజ్ సమయంలో పూజలు చేయడానికి, ఆచారాలు నిర్వహించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మక్కాకు వస్తారు.

అయితే అంతరిక్షం ( Space ) నుంచి ఈ మక్కా నగరం ఎలా కనిపిస్తుందో ఒక మహిళ వీడియో ద్వారా చూపించే ఆశ్చర్యపరుస్తున్నారు.మొదటి అరబ్ మహిళా వ్యోమగామి అయిన సౌదీ అరేబియా వ్యోమగామి రయ్యానా బర్నావి( Astronaut Rayyanah Barnawi ) ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి మక్కా అద్భుతమైన వీక్షణను పంచుకున్నారు.మక్కాతో పాటు , మిలమిల మెరిసే గ్రాండ్ మసీదు నైట్ వ్యూను చూపించే వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.రోజంతా కష్టపడి తన ప్రయోగాలను పూర్తి చేసిన తర్వాత తాను ఈ వ్యూ తీసానని వివరించింది.

అంతరిక్ష నౌక మక్కా మీదుగా వెళుతున్నప్పుడు, సౌదీ అరేబియా దేశం మొత్తం బ్రైట్‌గా కనిపించిందని.గ్రాండ్ మసీదు ప్రాముఖ్యతను ఎత్తి చూపిందని బర్నావి పేర్కొన్నారు.

రయ్యానా బర్నావి నానో మెటీరియల్స్‌కు సంబంధించి వివిధ ప్రయోగాలను చేస్తున్నారు.ప్రత్యేకంగా డ్రగ్ డెలివరీ, టిష్యూ ఇంజనీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్‌లో వాటి అప్లికేషన్‌లను అన్వేషిస్తున్నారు.బర్నావి స్పేస్‌లోకి వెళ్లడం సౌదీ అరేబియా, అరబ్ ప్రపంచానికి ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు.ఆమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అప్‌డేట్‌లు, అనుభవాలను తీసుకుంటున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube