పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.మరి ఈయన చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ”సలార్” (Salaar) ఒకటి.
ఈ సినిమాను 1000 కోట్లు రాబట్టే సినిమాగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు.కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక వార్త వస్తూనే ఉంది.షూటింగ్ గత రెండేళ్లుగా జరుపు కుంటూనే ఉంది.కొన్ని కొన్ని కారణాల వల్ల మధ్య మధ్యలో వాయిదా పడుతూ ఉన్న ఈ షూటింగ్ దాదాపు చివరి స్థాయికి చేరుకుంది.ఇక ఈ సినిమాను భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
జూన్ 16న ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.అదే రోజు సలార్ టీజర్ ను ఆదిపురుష్ సినిమాతో పాటు అటాచ్ చేసి థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నట్టు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.
ఈ న్యూస్ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారగా దీనికి సంబంధించి జూన్ ఫస్ట్ వీక్ లో మేకర్స్ నుండి అప్డేట్ కూడా రాబోతుంది అని అంటున్నారు.







