సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

సిద్ శ్రీరామ్. తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత గాయకుడిగా పేరు తెచ్చుకున్న గాయకుడు.

 Sid Sriram Remuneration Per Song Details, Sid Sri Ram, Singer Sid Sriram, Sid Sr-TeluguStop.com

ఆయన పాట పాడితే చాలు.మ్యూజికల్ హిట్ ఖాయం అనే పరిస్థితి నెలకొంది.

అంతేకాదు.ఆయన గాత్రం మూలంగా సినిమాలపై జనాలకు ఓ రేంజిలో అంచనాలు పెరిగిపోతాయి.

అందుకే చాలా మంది దర్శక నిర్మాతలు సిద్ శ్రీరామ్ తో పాటలు పాడించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.ఆయన ఏ సినిమాకు పాడినా, ఏ హీరోకి పాడినా ఆ పాటలకు సోషల్ మీడియాలో ఓ రేంజిలో పాపులారిటీ వస్తుంది.

లక్షల వ్యూస్ వచ్చి చేరుతాయి.అయితే ఆయన ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు అనే విషయంలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

వాస్తవానికి సిద్ శ్రీరామ్ పాడిన అన్ని పాటలు హిట్ అయ్యాయి.తన గొంతుతో ఆయా సినిమాలకే అద్భుత పేరు వచ్చేలా చేశాడు.పాట ఎలాంటిదైనా జనాలకు ఫీల్ కలిగేలా అత్యంత మెలోడియస్ గా పాడ్డం ఆయన స్పెషాలిటీ.అందుకే ఆయన రెమ్యునరేషన్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.

తనకున్న క్రేజ్ కు అనుగుణంగా ఎన్ని లక్షలు ఇచ్చేందుకైనా వెనుకాడ్డం లేదు నిర్మాతలు.ఆయన ఒక్క పాటపాడితే సుమారు 8 లక్షలు తీసుకుంటాడు.బ్యానర్ ను బట్టి రెమ్యునరేషన్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది.6 నెలల క్రితం వరకు 6 లక్షలు తీసుకున్న శ్రీరామ్.ప్రస్తుతం ఒక్కో పాటకు 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు.

చిన్న సినిమాలకు కాస్త తక్కువగానే డబ్బులు అందుకుంటాడు శ్రీరామ్.పెద్ద బ్యానర్ లో వచ్చే సినిమాలకు మాత్రం 10 లక్షల రూపాయలు తీసుకుంటాడు.అయితే ఈయన కెరీర్ తొలినాళ్లలో ఒక్కో పాటకు 4 లక్షలు అందుకునే వాడు.

కానీ ఆయన పాడిన పాటలు వరుసగా మంచి హిట్ అందుకోవడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచాడు.గతంలో వరుస పాటలు పాడిన ఆయన ప్రస్తుతం సెలెక్టివ్ గా పాడుతున్నాడు.

రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడు.

Singer Sid Sriram Remuneration per one song Sid Sriram

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube