ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.పొత్తుల అంశం కూడా కీలకంగా మారింది.
ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికార పార్టీ వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉండగా, మరోసారి వైసిపి ప్రభుత్వం ఏర్పడుతుందని, 175 స్థానాల్లోనూ గెలుస్తామనే ధీమాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) వ్యక్తం చేస్తున్నారు.అయితే జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్ లో పనిచేస్తుండగా, పార్టీలో కీలక నాయకులు మాత్రం వివిధ కారణాలతో అలక చెందుతూ, తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఇదేవిధంగా జగన్ కు బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivas Reddy ) వ్యవహారం మారింది.శ్రీనివాస్ రెడ్డి వసంతృప్తికి గురవడం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి వ్యవహారాలు వైసీపీలో కార్యక్రమం సృష్టించాయి చివరకు జగన్ పిలిపించుకుని మరి ఆయనను బొజ్జగించారు ఆ తర్వాత అంత సద్దుమణిగిందని భావించగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన బాలినేని పరోక్షంగా జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు.తాను జగన్ మాట తప్ప ఎవరి మాట వినను అని కామెంట్ చేశారు తన మంత్రి పదవి పోవడానికి వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) కారణమని అందుకే జగన్ వద్ద తన కొరకుబడి తగ్గిందని బాలు లేని అసంతృప్తితో ఉన్నారు తాను టిక్కెట్లు ఇప్పించిన వారి తణుకు వ్యతిరేకంగా పావులు కలుపుతున్నారని జగన్ కు ఫిర్యాదులు చేస్తున్నారని వారిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదు అనే ప్రచారం చేస్తున్నారని దీని అంతటికి వైవి సుబ్బారెడ్డి కారణమని అనుమానిస్తూ హైకమాండ్కు బాలుని ఫిర్యాదు చేశారట కనిపించకపోవడంతో మీడియా ముందుకు వచ్చి వైవీ సుబ్బారెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారట.

ఇదేవిధంగా చాలాకాలంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )వ్యవహారంలోనూ వైవి సుబ్బారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్న సమయంలోనే, ఆయనను తొలగించి ఆ స్థానంలో వైవి సుబ్బారెడ్డిని జగన్ నియమించారు.ఇక అప్పటి నుంచి విజయ్ సాయి రెడ్డి సైలెంట్ గానే ఉంటున్నారు.
ఇటీవల విజయసాయిరెడ్డి ప్రధాన అనుచరులు ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తూ వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పడం వంటి వ్యవహారాలపై విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ పార్టీలో కీలక నేతలే.జగన్ కు అత్యంత సన్నిహితులే.అయితే వీరిద్దరి అసంతృప్తికి కారణం వై వి సుబ్బారెడ్డే.కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన కీలక నేతలు ఈ విధంగా గురవడం, బహిరంగంగా పార్టీ ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా వ్యవహరించడం వంటి వ్యవహారాలపై జగన్ మాత్రం చాలా సీరియస్ గానే ఉన్నారట.