మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమాలో అందాల భామలు త్రిష, ఐశ్వర్య రాయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.చారిత్రిక కథతో మణిరత్నం ఎంతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు.
సినిమాలో చోళ సామ్రాజ్యపు రాణి కుందవై పాత్రలో త్రిష కనిపిస్తుండగా.ఐశ్వర్య రాయ్ నందిని పాత్రలో నటిస్తుంది.
ఐశ్వర్య రాయ్ పాత్రలో కొన్ని నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ టైం లో త్రిష, ఐశ్వర్య రాయ్ సెల్ఫీ తీసుకున్నారు.
ఈ సెల్ఫీ ఎప్పటిదో అయినా త్రిష లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.త్రిష, ఐశ్వర్యా రాయ్ సెల్ఫీ చూసిన ఆడియన్స్ ముద్దుగుమ్ముల సెల్ఫీ అదిరిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఏజ్ బార్ అవుతున్నా సరే ఐశ్వర్యా రాయ్, త్రిష ఇద్దరికి క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు.

పొన్నియిన్ సెల్వన్ సినిమాలో విక్రం, కార్తీ, జయం రవి నటించారు.ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల చివరన రిలీజ్ అవుతున్న పి.ఎస్ 1 సినిమా భారీ అంచనాలతో వస్తుంది.కోలీవుడ్ బాహుబలిగా వస్తున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.







