నల్లగొండ జిల్లా: అనుముల మండలం హజారిగూడెం గోపాలమిత్ర(Anumula Mandal, Hazarigudem Gopalamitra) సెంటర్ పరిధిలోని ఇబ్రహీంపేట(Ibrahimpet) గ్రామంలో సోమవారం జిల్లా పశు గణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా గర్భం దాల్చని పశువులను గుర్తించి తగిన చికిత్స చేశారు.
యదకు వచ్చిన పశువులను గుర్తించి కృత్రిమ గర్భాధారణ, చూడి పశువులకు చూడి పరీక్షలను నిర్వహించారు.అనంతరం దూడల ప్రదర్శన నిర్వహించి వాటికి నట్టల నివారణ, విటమిన్ ఇంజక్షన్లు,పాల దిగుబడిని పెంచే ఖనిజ లవణ మిశ్రమాలను పంపిణీ చేశారు.
రైతులకు కృత్రిమ గర్భాధారణ మరియు మేలు జాతి దూడలు,పాడి పశువులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడవెల్లి అనుపమ, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి,కౌన్సిలర్ నల్లమోతు వెంకటయ్య, అనుముల మండల వెటర్నరీ డాక్టర్ మహిపాల్ రెడ్డి,గోపాలమిత్ర సూపర్వైజర్ నడ్డి బాలరాజు యాదవ్, కోఆప్షన్ మెంబర్ చేపల సైదులు,గోపాల మిత్రులు జానపాటి కోటయ్య, అనిల్,లాలు మరియు గ్రామ పెద్దలు,రైతులు పాల్గొన్నారు.