నల్లగొండ జిల్లా:పోలీస్ అధికారులు,సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని,వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మెడికేర్,అపోలో,ఇండియన్ మెడికల్అసోసియేషన్, సురక్ష వివిధ హస్పటల్ డాక్టర్ల సహకారంతో సోమవారం మెఘా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 1000 మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి నిపుణులైన కార్డియాలజీ,ఆర్థోపెటిక్, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ,ఆర్తాల్మిక్, గైనకాలజీ,ఈఎన్టీ, వైద్యులతో పరీక్షలు నిర్వహించి,తగు సూచనలు,సలహాలతో పాటు కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ వారి సహకారంతో ఉచిత మందులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం నిద్ర లేకపోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు.ముఖ్యంగా సిబ్బంది విధులతో పాటు ఆరోగ్య దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ప్రతి రోజూ వ్యాయామం, నడక,యోగాలాంటివి రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు.విధి నిర్వహణే కాకుండా సిబ్బంది వారి సంక్షేమం కొరకు ఉచిత హెల్త్ క్యాంపులు నిరహిస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సూచించారు.ఈ హెల్త్ క్యాంపుకు సహకరించిన మెడికల్ హాస్పిటల్ వైద్యులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే మిర్యాలగూడ, దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్,ఎస్బి డిఎస్పీ రమేష్,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మినారాయణ,ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, మెడికవర్ కార్డియాలిస్ట్ డాక్టర్ శ్రీధర్,అపోలో డాక్టర్ సల్మాన్, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్,ఐఎంఎ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు,సురక్ష హాస్పిటల్ డాక్టర్ రమేష్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ,విశ్వ హృదయ హస్పటల్ డాక్టర్ నరహరి, డ్రగ్ అండ్ కెమిస్ట్రీ ప్రెసిడెంట్ పరమాత్మ, సిఐలు రాఘవరావు, డానియల్,సైదులు, రాజశేఖర్,కొండల్ రెడ్డి, రాజు,ఆర్ఐలు సంతోష్, హరిబాబు,సురప్పనాయుడు,ఎస్ఐలు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.