నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్( KCR ) తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు.నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే రైతు గర్జన బీఆర్‌ఎస్( BRS ) బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర సర్కార్ కు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా కేసీఆర్ ఎండగట్టాలని చూస్తున్నారు.కేఆర్‌ఎంబీ( KRMB )కి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందించనున్నారనేది ఆసక్తిగా మారింది.6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభా వేదికగా గులాబీ దళపతి అల్టిమేటం జారీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.