మాయం అవుతున్న మరో మూడు బ్యాంకులు.. ఏవేవో తెలుసా?  

Reserve Bank Of India Privatisation - Telugu Bank, Indian Overseas Bank, Privatisation, Reserve Bank Of India

బ్యాంకింగ్ రంగానికి మరింత బలం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

 Reserve Bank Of India Privatisation

ఇటీవల 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా విలీనం చేసిన కేంద్రం, ఇప్పుడు మరో 3 బ్యాంకులను విలీనం చేసేందుకు సిద్ధం అవుతోంది.

నీతి ఆయోగ్ మరోమారు బ్యాంకుల విలీన ప్రతిపాదనపై ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మాయం అవుతున్న మరో మూడు బ్యాంకులు.. ఏవేవో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను ఒకే బ్యాంకుగా విలీనం చేయాలని కేంద్ర భావిస్తోంది.ఈ క్రమంలో చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులు చర్చిస్తున్నారు.

పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో బెయిలౌట్లను నిలిపివేయాలనేది ఈ ప్రతిపాదన యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు.

ఏదేమైనా దేశంలో మరో మూడు బ్యాంకులు కనుమరుగయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

దీంతో ఈ బ్యాంకులు ప్రైవేటీకరణ అవుతున్నాయా లేక విలీనమవుతున్నాయా అనే సంధిగ్ధంలో వినియోగదారులు ఉన్నారు.మరి ఈ మూడు బ్యాంకులు ఏ బ్యాంకులో విలీనమవుతాయో చూడాలి అంటున్నారు మార్కెట్ ఎక్స్‌పర్ట్స్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test