హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పిటిషన్ దాఖలు చేశారు.మే 17 నుంచి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.
ఈ నెల 17 వ తేదీ నుంచి జూన్ ఒకటోవ తేదీ మధ్య లండన్ తో పాటు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ మేరకు దేశం విడిచి వెళ్లొద్దన్న బెయిల్ షరతులను సడలించాలని ఆయన కోర్టును కోరారు.
ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐ( CBI )కి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.