వైసీపీ మహిళలే టార్గెట్ గా టీడీపీ నేతల దాడులు.. ఏపీలో పరిస్థితులు ఇంత ఘోరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా ఎన్నికల సమయంలో వైసీపీ మహిళలే టార్గెట్ గా టీడీపీ నేతల దాడులు జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఒక ఘటనను మరవక ముందే మరో ఘటన జరుగుతుండటం గమనార్హం.

 Tdp Targets Ycp Lady Politicians Details Here Goes Viral In Social Media , Tdp-TeluguStop.com

కొంతకాలం క్రితం మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో టీడీపీ నేతలు దాడులు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను మరవక ముందే కొన్ని గంటల గ్యాప్ లో వైసీపీ మహిళా నేతలపై దాడులు జరిగాయి.

Telugu Bonda Uma, Chandrababu, Nallajerla, Pawan Kalyan, Rama Devi, Taneti Vanit

నిన్న బెజవాడలో బోండా ఉమ( Bonda Uma ) అనుచరులు వైసీపీ మహిళా కార్యకర్తలపై దాడులు చేశారు.పాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో నిన్న హోంమంత్రి తానేటి వనిత( Taneti Vanitha)పై దాడి జరిగింది.ఈరోజు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై దాడి జరింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ఇంతకు తెగించారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bonda Uma, Chandrababu, Nallajerla, Pawan Kalyan, Rama Devi, Taneti Vanit

సిరిగిరిపాడులో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటంతో పాటు అదే గ్రామంలో ప్రచారం చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి( Pinnelli Ramakrishna Reddy ) భార్య రమాదేవిపై కూడా దాడి చేశారు.ఈ ఘటనలో రమాదేవి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.దాడిని ఆపడానికి ప్రయత్నించిన ఎస్సై శ్రీహరిపై కూడా దాడి చేశారంటే టీడీపీ నేతల తీరు ఎంత దారుణంగా ఉందో సులువుగా అర్థమవుతుంది.చంద్రబాబు నాయుడు, పవన్, ఇతర కూటమి నేతలు వైసీపీ మహిళలపై జరుగుతున్న దాడులను ఏ విధంగా సమర్థించుకుంటారని రాష్ట్రంలోని సామాన్య మహిళలు సైతం ప్రశ్నిస్తున్నారు.

మహిళల విషయంలో, మహిళా నేతల విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించిన రాజకీయ పార్టీ టీడీపీ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.టీడీపీ నేతలను ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదని తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube