ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి.ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో రాజకీయ నాయకుల్లో టెన్షన్ మొదలయ్యింది.
ఇప్పటికే మామూలు కార్యకర్తలు ఆ పార్టీ అభిమానులతో పాటు చాలామంది సినీ నటులు కూడా ఆయా పార్టీల తరఫున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.వైసీపీ ( YCP )తరఫున కొంతమంది ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కథ వివాదాస్పదం అయింది.అందులో చంద్రబాబు( Chandrababu Naidu)ని గుంట నక్కతో పోల్చింది అంటూ ఆమె మీద తెలుగుదేశం శ్రేణులతో పాటు జనసేన సైనికులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఒకప్పుడు వైసీపీలో ఉండి ప్రస్తుతం జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న కమెడియన్ పృథ్వీరాజ్ యాంకర్ శ్యామలకు కౌంటర్ ఇచ్చారు.నేను చేసిన లౌక్యం సినిమాలో ఆవిడ ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేసింది.
ఎవరు ఆవిడ అని ప్రశ్నిస్తే పక్కనున్న వ్యక్తి పావలా శ్యామల అని కామెంట్ చేశాడు.కాదు కాదు పావలా కాదు యాంకర్ శ్యామల అంటూ కమెడియన్ పృథ్వీ చెప్పుకొచ్చారు.ఆవిడ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని గుంట నక్క అని ఎలా మాట్లాడిందో గతంలో నగరి రోజమ్మ కూడా ఒక దరిద్రుడు జైలుకెళితే మరో దరిద్రుడు జైలుకెళ్లి పరామర్శించాడు అంటూ మాట్లాడింది.వీళ్ళకి లోపల ఉద్దేశాలు ఒకటే కానీ మాటలు మాత్రమే మార్చి మాట్లాడుతూ ఉంటారని పృథ్వీరాజ్ విమర్శించారు.
మేము జనసేన తరఫున వీర మహిళలతో కలిసి విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో పర్యటించాం.రెల్లి వీధి లాంటి ఎన్నో వీధుల్లో పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉంది.అక్కడ దుర్గంధ భరితంగా ఉంటే ఈవిడ మాత్రం వచ్చి విశాఖపట్నం చాలా సుందరంగా ఉంది అంటూ మాట్లాడుతోంది.ఆమెకు బహుశా విశాఖపట్నం అందంగా ఉంది అని చెప్పడానికి డబ్బులు ఇచ్చారేమో అంటూ పృథ్వీరాజ్ విమర్శించారు.