ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈయన పుష్ప 2 (Pushpa 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇకపోతే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆర్య సినిమా(Arya Movie) విడుదలై 20 సంవత్సరాలు కావడంతో ఇటీవల దిల్ రాజు( Dil raju ) ఏర్పాటు చేసిన ఈవెంట్ లో అల్లు అర్జున్ ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా సినిమా షూటింగుల కోసం తాను ఎలా కష్టపడుతున్నారనే విషయాలను కూడా వివరించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆర్య సినిమా సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.నాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం ఆరోజు నైట్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేస్తానని అల్లు అర్జున్ తెలిపారు.అలాగే ఆర్య సినిమా సమయంలో న్యూ ఇయర్ రోజు నైట్ మొత్తం పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసాము.
మరుసటి రోజు ఉదయం ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఒక పాట చిత్రీకరణ కోసం రావాలని ఫోన్ కాల్ వచ్చింది.అయితే నేను సినిమా షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లానని తెలిపారు.
నైట్ అంతా నిద్ర లేకపోవడం ఒక కారణం పైగా ఎండలు కూడా ఉండడంతో షూటింగ్లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించిందని అల్లు అర్జున్ తెలిపారు.
ఆరోజు తాను పడిన ఇబ్బందులకు గట్టి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.షూటింగ్ ఉంటే ముందు రోజు రాత్రి 10 గంటలకే నిద్రపోవాలని నిర్ణయం తీసుకున్నాను అలాగే ఎలాంటి పార్టీలు పెట్టుకోకూడదని పార్టీలకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాను.ఆరోజు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ వస్తున్నానని తెలిపారు.
ఇప్పటికీ కూడా తాను షూటింగ్ ఉంది అంటే ముందు రోజు పార్టీలకు వెళ్ళనని తాను ఆరోజు నైట్ మనస్ఫూర్తిగా నిద్రపోతాను అని అల్లు అర్జున్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.