కోలీవుడ్ హీరో డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి మనందరికీ తెలిసిందే.గత కొద్దిరోజులుగా రాఘవ లారెన్స్(Raghava Lawrence) పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది.
ప్రస్తుతం రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా దూసుకుపోతున్నారు.ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అంటూ సహాయం చేస్తూ ఎంతోమందికి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.
ఆ మధ్యన మాత అనే ఫౌండేషన్(Mata Foundation) ఆధ్వర్యంలో పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి లారెన్స్ శ్రీకారం చుట్టారు.
ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు ఈ రియల్ హీరో.తాజాగా విల్లుపురం జిల్లాలోని(Villupuram Distric) ఒక పేద రైతు కుటుంబానికి స్వయంగా అతనే ట్రాక్టర్‌ను అందించారు.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్(raghava lawrence,) సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఇచ్చిన మాట ప్రకారం విల్లుపురం జిల్లాలోని ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని అందులో తెలిపారు లారెన్స్.మీ ప్రేమ, అభిమానాలను చూస్తుంటే.నాకు మరింత శక్తిని ఇస్తున్నాయి.ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోంది.
మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం.అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు రాఘవ లారెన్స్.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియో చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.మొన్నటికి మొన్న దివ్యాంగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అని చెప్పవచ్చు.ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని వితంతువులు తమకు కుట్టుమిషన్లు కావాలని లారెన్స్ ను కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే 500 కుట్టు మిషన్ల ను అందజేస్తామని హామీ ఇచ్చారు.
మేము ఈ వ్యవస్థను ఇప్పుడే ప్రారంభించాం.ఇలా ఒకదాని తర్వాత ఒకటి సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనసులు చాటుకుంటూ వెళ్తున్నారు.