టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఇతరులతో సరదాగా ఉండటానికి చరణ్ ఇష్టపడతారు.2019 సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ప్రేక్షకులు ఆ సమయంలో ఎఫ్2 సినిమాను( F2 Movie ) హిట్ చేశారు.అయితే ఆ సినిమాల విడుదలకు కొన్ని నెలల ముందు చరణ్, అనిల్ మధ్య సరదా సంఘటన చోటు చేసుకుందట.
ఒక ఈవెంట్ లో అనుకోకుండా రామ్ చరణ్, అనిల్ రావిపూడి కలిశారట.
ఆ సమయంలో రామ్ చరణ్ అనిల్ రావిపూడితో( Anil Ravipudi ) నా సినిమాకే పోటీగా నీ సినిమాను రిలీజ్ చేస్తున్నావా అని కామెంట్ చేశారట.రామ్ చరణ్ అలా కామెంట్ చేయడంతో షాకవ్వడం చరణ్ సొంతమైంది.
ఆ తర్వాత రామ్ చరణ్ అనిల్ ను హగ్ చేసుకుని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారట.
రామ్ చరణ్ అలా చెప్పడంతో అనిల్ రావిపూడి కూల్ అయ్యారట.రామ్ చరణ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer Movie ) సినిమాతో బిజీగా ఉన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాదే విడుదల కానుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గేమ్ ఛేంజర్ బడ్జెట్ అదుపు తప్పకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రామ్ చరణ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.