ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి నెలకొంది.మరొక నాలుగు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల గురించి చర్చలు జరుపుతున్నారు ముఖ్యంగా ఆంధ్ర ఎన్నికల ( AP Elections ) పై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) పిఠాపురం( Putapuram ) నుంచి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో సినీ ఇండస్ట్రీలో మరి కాస్త ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోలు సెలబ్రిటీలు దర్శకులు నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా హీరోల నుంచి మొదలుకొని టీవీ ఆర్టిస్టుల వరకు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే యాంకర్ గా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రవి ( Ravi ) ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయనకు ఏపీ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తనకు కూడా తెలంగాణలోను అలాగే ఆంధ్రాలో పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనాలి అంటూ చాలా మంచి ఆఫర్ ఇచ్చారు.
కానీ నాకు రాజకీయాల గురించి అవగాహన లేదు అందుకే ప్రచారాలకు వెళ్లలేదని తెలిపారు.
మనం ప్రచారాలకు వెళ్లాలి అంటే రాజకీయాల పరంగా కొంత అవగాహన ఉంటేనే వెళ్ళగలమని లేదంటే అక్కడ వెళ్లి ఏం మాట్లాడలేమని తెలియజేశారు.మనం ప్రచారాలకు వెళ్లిన వెళ్ళకపోయినా ప్రజలు మాత్రం వారు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో వారికే వేస్తారని తెలిపారు.జనాలందరూ చాలా తెలివైన వారు.
నాకు పవన్ కళ్యాణ్ హీరోగా చాలా ఇష్టం కానీ నేను మాత్రం మోడీకే ఓటు వేస్తానని రవి తెలిపారు.అలాగే ప్రజలందరికీ కూడా నేను మోడీకే ఓటు వేయమని చెబితే వాళ్ళు వేయరు… వారికి నచ్చిన వారికే ఓటు వేస్తారు అంటూ ఈ సందర్భంగా రవి పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
.