కోవై సరళ( Kovai Sarala ).ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కోవై సరళ.ముఖ్యంగా తెలుగులో బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్ల పక్కన నటించి తన కామెడీతో అదుర్స్ అనిపించుకుంది.తన టైమింగ్, తన కామెడీతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంది.ఈ మధ్య సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో క్రేజ్ మాత్రం అదే రేంజ్‌లో ఉంది.
ఇకపోతే తెలుగులో చివరిగా నాయకి అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా 2016 లో విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.ఈ సినిమా తర్వాత ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో( Tamil movies ) నటిస్తూ అక్కడ ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది.అయితే ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కడ కనిపించలేదు.
కానీ తాజాగా కోవై సరళ ఫుల్ లెంగ్త్‌లో నటించిన తమిళ చిత్రం అరణ్మై4 ( Aranmai 4 )తెలుగులో బాక్ అనే సినిమాలో నటించగా ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటుంది.ఈ క్రమంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
అవకాశం ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం 62 ఏళ్లు దాటిన కోవై సరళ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తోంది.తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ షోలో( Comedian Ali Show ) కూడా పాల్గొంది.ఈ సందర్భంగా ఆలీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు తెలిపింది.
ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని అలీ అడగగా పెళ్లి అనేది నాకు ఇష్టం లేదు.అయినా పెళ్లి చేసుకుంటేనే జీవించాలని ఏమైనా రూల్ ఉందా అంటూ ఎదురు ప్రశ్నించింది.
ఛాన్సు ఉంటే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఉందని అడగగా, మరోమాట లేకుండానే అల్లు అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.