టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ( Hero Prabhas )గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్ చివరగా సలార్( Salar ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు హీరో ప్రభాస్.
ఇప్పుడు అదే ఊపుతూ మరి కొన్ని సినిమాలలో నటిస్తున్నారు.కాగా సలార్ సినిమాతో మళయాళ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్( Prithviraj ) కూడా టాలీవుడ్ లో సాలిడ్ డెబ్యూ ఇచ్చారు.అయితే పృథ్వీ తాజాగా చేసిన స్టేట్మెంట్ ఒకటి ఒక రేంజ్ లో వైరల్ గా మారుతుంది.సలార్ లో తమ మన్నార్ పాత్రకి క్రేజీ క్రాస్ ఓవర్ ఉంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు.
అయితే ఈ క్రేజీ క్రాస్ ఓవర్ కి ఛాన్స్ కేజీయఫ్ తో తప్పకుండా ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేజీయఫ్ లో నటులు చాలా మంది సలార్ లో కూడా ఉన్నారు.సో ఇక మిగిలింది తారక్ తో ప్రశాంత్ నీల్ చేయనున్న భారీ సినిమానే అని చెప్పాలి.
మరి ఇది కానీ నిజం అయితే మాత్రం ఆ ఊహ కూడా మామూలు లెవెల్లో లేదు.ప్రస్తుతం సలార్ 2 పనులు అయితే జరుగుతూ ఉండగా ఎన్టీఆర్( NTR ) దేవర, వార్ 2 లలో బిజీగా ఉన్నాడు.కాగా సలార్ యూనివర్స్ లో ఎన్టీఆర్ అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఈ విషయం గురించి ఇంకా అనేక రకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇకపోతే తారక్ విషయానికి వస్తే.ఆర్ఆర్ఆర్ తో ఆల్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అదే ఊపుతో దేవర మూవీలో నటిస్తున్నారు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.