తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటుడు అర్జున్ ( Actor Arjun )గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్.
ఇది ఇలా ఉంటే త్వరలోనే అర్జున్ కూతురు హీరోయిన్ ఐశ్వర్య( Heroine Aishwarya ) అర్జున్ పెళ్లి పీటలు ఎక్కనుంది.జూన్ 10న ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట బోతోంది.
అయితే నిశ్చితార్థం ఎక్కడ జరిగిందో, పెళ్లి కూడా అక్కడే జరగనుంది.తమిళ నటుడు తంబి రామయ్య ( Actor Thambi Ramaiah )తనయుడు ఉమాపతి, అర్జున్ కూతురు ఐశ్వర్య కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే.
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.వీళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు.గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.చెన్నైలో అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది.
అదే ఆలయంలో పెళ్లికూడా జరగబోతోంది.
కాగా తమిళ్ లో అర్జున్ హోస్ట్ చేసిన ఓ కార్యక్రమంలో ఉమాపతి( Umapati ) పాల్గొన్నాడు.అదే కార్యక్రమంలో ఐశ్వర్య అర్జున్ పరిచయం అయ్యింది ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.తన చిన్న కొడుకు ఉమాపతి, తన ప్రేమ సంగతి చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు తంబి రామయ్య.
అర్జున్ తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పనిచేసేందుకు ప్రోత్సహించారు.అలా తండ్రి ఆశీస్సులతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఐశ్వర్య, విశాల్ లాంటి హీరోల సరసన కొన్ని సినిమాలు చేసీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.