12 ఏళ్లలో ఏలియన్స్ నుంచి భూమికి సందేశం వస్తుందా.. సైంటిస్టులు కామెంట్స్ వైరల్..?

ఎన్నో ఏళ్ళుగా, శాస్త్రవేత్తలు( Scientists ), అంతరిక్షంపై ఆసక్తి గల వ్యక్తులు ఏలియన్ల నుంచి ఏదైనా రకమైన సంకేతాలు వస్తాయా అని చాలా ఎదురుచూస్తున్నారు.ఏలియన్ల ఉనికి ఎన్నో సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రాణం పోసింది.

 Will A Message From Aliens Come To Earth In 12 Years Scientists' Comments Go Vir-TeluguStop.com

మన ఆలోచనలను ఊహా ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.ఏలియన్స్ గురించి అనేక సంస్థలు పరిశోధనలు కూడా చేస్తున్నాయి.అమెరికా, కాలిఫోర్నియాలోని సెటి ఇనిస్టిట్యూట్ ( SETI Institute in California )అనేది భూగోళ బాహ్య జీవాల ఉనికి కోసం పరిశోధన చేసే ప్రముఖ సంస్థ.

1984లో స్థాపించిన దాని లక్ష్యం గ్రహాంతరవాసులు, వాటి స్వభావాన్ని వివరించడం.గత 50 సంవత్సరాలుగా, సెటి గెలాక్సీల నుంచి వచ్చే ఏదైనా సంకేతాల కోసం అంతరిక్షాన్ని స్కాన్ చేయడం ద్వారా తెలివైన జీవుల ఉనికి కోసం అవిశ్రాంతంగా వెతుకుతోంది.సెటి ఇనిస్టిట్యూట్ లో సీనియర్ ఖగోళ శాస్త్రవేత్త అయిన సేథ్ షోస్టక్( Seth Shostak ) 10 నుండి 15 సంవత్సరాలలోపు మనకు ఎలియన్ల నుంచి ఏదో ఒక సంకేతం లేదా కమ్యూనికేషన్ వస్తుందని ఆశాభావంగా ఉన్నారు.

అంతరిక్షంలో ఎక్కడో తెలివైన జీవులు ఉంటే, మనం భూమి నుంచి పంపించే ఉపగ్రహ సంకేతాలను వారు గుర్తించే అవకాశం ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Telugu Alien Quest, Satellite, Search, Seth Shostak, Seti Institute, Signals Spa

కొన్నేళ్ల క్రితం, రెడిట్‌లో జరిగిన ఒక “అస్క్ మీ ఎనీథింగ్” ( Ask Me Anything )సెషన్ లో, 2036కి ముందు మనం తెలివైన ఏలియన్లను కనుగొంటామనే తన మునుపటి అంచనాను ఇంకా నమ్ముతున్నారా అని షోస్టాక్‌ను అడిగారు.“అవును! హార్డ్‌వేర్‌ను మెరుగుపరచడంలో, ముఖ్యంగా కంప్యూటర్ల రంగంలో, పురోగతి నిరంతరం కొనసాగుతోంది.2036 నాటికి మనకు ఒక సంకేతం అందుతుందని నేను ఇంకా నమ్ముతున్నాను.” అని ఆయన స్పష్టం చేశారు.

Telugu Alien Quest, Satellite, Search, Seth Shostak, Seti Institute, Signals Spa

2023లో మాంచెస్టర్ యూనివర్సిటీ ( University of Manchester )నిర్వహించిన ఒక అధ్యయనం ఈ అవకాశానికి మరింత బలం చేకూర్చింది.ఈ అధ్యయనం భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాల గురించి ప్రస్తావించింది, అవి అనుకోకుండా ఎక్కువ రేడియో సంకేతాలను విడుదల చేస్తాయి.ప్రాజెక్ట్ టీం లీడర్, జోడ్రెల్ బ్యాంక్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ మైక్ గారెట్ ప్రకారం, నేడు మనకు తక్కువ శక్తివంతమైన టీవీ, రేడియో ట్రాన్స్‌మిటర్లు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థల వ్యాప్తి గణనీయంగా ఉంది.

భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు రేడియో సంకేతాలను విడుదల చేస్తాయి.ఈ రేడియో సంకేతాలు భూమిని రేడియో స్పెక్ట్రమ్‌లో ప్రకాశవంతంగా చేస్తాయి.అధునాతన ఏలియన్ నాగరికతలు ఈ సంకేతాలను గుర్తించగలవు.శాస్త్రవేత్తలు ఏలియన్ల ఉనికిని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube