సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ (Jagan)చిత్తశుద్దితో పని చేస్తున్నారని తెలిపారు.
పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారని పోసాని పేర్కొన్నారు.లంచాలు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని తెలిపారు.
జగన్ పాలనలో పేదలు అభివృద్ధి చెందారన్న ఆయన చంద్రబాబు (Chandrababu)అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు ఉంటుందని వెల్లడించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎంత సంపద సృష్టించారని ప్రశ్నించారు.మరోవైపు చిరంజీవికి(Chiranjeevi) ప్రజలు అంటే లెక్కలేదన్న పోసాని (Posani) ప్రజా సేవ అని పార్టీ పెట్టీ మూసేశారని విమర్శించారు.సినిమాలానే రాజకీయాన్ని కూడా వ్యాపారంలా చూశారని మండిపడ్డారు.
చిరంజీవి గతంలో 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు అమ్మేశారని ఆరోపించారు.