ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు..!!

ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టారు.దీంతో 86 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

 Air India Express Employees Mass Leave, Air India, Air India Express, Cabin Crew-TeluguStop.com

దాదాపు మూడు వందల మంది క్యాబిన్ క్రూ(Cabin crew) అనారోగ్యంతో సెలవులు పెట్టారని ఎయిర్ ఇండియా (Air India) సంస్థ తెలిపింది.అయితే సంస్థలో కొన్ని విధానాల పట్ల సిబ్బంది కాస్త అసంతృప్తిలో ఉన్నారని, ఈ క్రమంలోనే ఉద్దేశ పూర్వకంగానే మూకుమ్మడి సెలవులు పెట్టారనే టాక్ వినిపిస్తోంది.

చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టిన సిబ్బంది తమ ఫోన్లను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో సిబ్బందితో మాట్లాడేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.

అయితే విమానాలు అకస్మాతుగా రద్దు కావడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణలు చెప్పింది.

అయితే సంస్థపై గత కొన్నిరోజులుగా సిబ్బంది అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.సిబ్బంది అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube