ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు..!!
TeluguStop.com
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులు మూకుమ్మడిగా సెలవులు పెట్టారు.దీంతో 86 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
దాదాపు మూడు వందల మంది క్యాబిన్ క్రూ(Cabin Crew) అనారోగ్యంతో సెలవులు పెట్టారని ఎయిర్ ఇండియా (Air India) సంస్థ తెలిపింది.
అయితే సంస్థలో కొన్ని విధానాల పట్ల సిబ్బంది కాస్త అసంతృప్తిలో ఉన్నారని, ఈ క్రమంలోనే ఉద్దేశ పూర్వకంగానే మూకుమ్మడి సెలవులు పెట్టారనే టాక్ వినిపిస్తోంది.
చివరి నిమిషంలో సిక్ లీవ్ పెట్టిన సిబ్బంది తమ ఫోన్లను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో సిబ్బందితో మాట్లాడేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.
అయితే విమానాలు అకస్మాతుగా రద్దు కావడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా సంస్థ క్షమాపణలు చెప్పింది.అయితే సంస్థపై గత కొన్నిరోజులుగా సిబ్బంది అసంతృప్తిలో ఉన్నారని సమాచారం.
సిబ్బంది అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రేవతి మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేయడం రైటేనా.. నెటిజన్ల అభిప్రాయమిదే!