టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) సక్సెస్ రేట్ నూటికి నూరు శాతం అనే సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి పోటీ అంతకంతకూ పెరుగుతోంది.
అయితే జక్కన్న ఐదేళ్లకు ఒక సినిమా తీయడం విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది.రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పడిన సక్సెస్ అంతాఇంతా కాదు.
అయితే జక్కన్న ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఆర్.ఆర్.ఆర్ మల్టీస్టారర్ తెరకెక్కించడమే తప్పు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ సినిమాను( RRR movie ) ఒకే స్టార్ హీరోతో తెరకెక్కించేలా జక్కన్న ప్లాన్ చేసుకుని ఉండి ఉంటే మాత్రం బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.రాజమౌళి క్రేజ్, రెమ్యునరేషన్, పాపులారిటీ వేరే లెవెల్ అని అయినప్పటికీ చరణ్, ఎన్టీఆర్ పాత్రలకు సమ న్యాయం చేయడంలో మాత్రం జక్కన్న ఫెయిల్ అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కు జక్కన్న దూరంగా ఉంటే మంచిదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
రాజమౌళి మహేష్ సినిమాను అంతకంతకూ ఆలస్యం చేస్తుండటం ఫ్యాన్స్ కు చిరాకు తెప్పిస్తోంది.మహేష్( Mahesh babu ) ఒక్క సినిమా కోసం 3 నుంచి 4 సంవత్సరాల సమయం కేటాయించడం రైట్ కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలుకావడానికి మరో ఐదు నెలల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.రాజమౌళి ఈ సినిమా కోసం ఇంత ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
వేగంగా సినిమాలను తెరకెక్కించకపోతే జక్కన్న హీరోలకు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినా లాభం ఉండదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి మహేష్ సినిమా తర్వాత ఏ స్టార్ హీరోతో సినిమాను ప్లాన్ చేస్తారో తెలియాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.