యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామంలో వాటర్ ఫిల్టర్ లేక గత ఐదు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపిస్తూ బుధవారం గ్రామస్తులు వాటర్ షెడ్ ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లడుతూ గ్రామంలో గతంలో వాటర్ షెడ్ ని ఏర్పాటు చేశారని, అందులో ఉన్న వాటర్ ఫిల్టర్ మిషన్( Water Filter Mission) ఐదు నెలల నుండి పనిచేయక తాగునీరు కోసం అల్లాడుతున్నామని,అసలే వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి.
ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరక, జనరల్ వాటర్ తాగలేక జనం అవస్థలు పడుతుంటే అధికారులకు,ప్రజా ప్రతినిధులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.దాహార్తికి తట్టుకోలేక రెండు కి.మీ.దూరంలో ఉన్న సంస్థాన్ నారాయణపురం వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకునే పరిస్థితి నెలకొందని వాపోయారు.వాటర్ ఫిల్టర్ లేక కృష్ణా వాటర్ తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) స్పందించి మహ్మదాబాద్ ప్రజల తాగునీటి సమస్య సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు
.






