ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్( Covid-19 vaccine ) ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ ( AstraZeneca Company )తెలిపింది.ఈ మేరకు వాణిజ్య కారణాలతో వ్యాక్సిన్ ను మార్కెట్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్నాయని కొన్ని రోజుల కిందట ఆస్ట్రాజెనెకా సంస్థ అంగీకరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కోవిడ్ -19 వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కొత్త కోవిడ్ వేరియంట్ లతో పోరాడే వ్యాక్సిన్ ను కూడా ఇకపై తయారు చేయబోమని ఆస్ట్రాజెనెకా సంస్థ తెలిపింది.కాగా వ్యాక్సిన్ ను నిన్నటి నుంచి ఉపసంహరించుకుంది.
అయితే ఆస్ట్రాజెనెకా సంస్థ వ్యాక్సిన్ తో రక్తం గడ్డకట్టడం వంటి అరుదైన దుష్ప్రభావాలు కలిగినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఆస్ట్రాజెనెకాపై యూకే హైకోర్టు( UK High Court )లో 50 మందికి పైగా బాధితులు కేసు వేసిన సంగతి తెలిసిందే.