గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి , వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను టార్గెట్ చేస్తూనే సంచలన విమర్శలు చేస్తున్న ముద్రగడ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ, మీడియా సమావేశం నిర్వహిస్తూ, సంచలన విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ విమర్శలకు ముద్రగడ నుంచే కాకుండా, ఆయన కుమార్తె క్రాంతి భారతి నుంచి కౌంటర్లు పడుతున్నా యి.తాజాగా మరోసారి ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించి, మెగా కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను నికార్సు అయిన కాపునని, పవన్ ఫ్యామిలీ చరిత్ర ఏమిటో చెప్పాలంటూ ముద్రగడ సవాల్ చేశారు.

” అసలు సిసలైన కాపులు ఎవరు ? కల్తీ కాపులు ఎవరు అనేది ప్రజలకు తెలియాలి.మెగా ఫ్యామిలీ అమ్మాయిని ప్రేమించిన మరో కులానికి చెందిన నటుడికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి , అతను కృంగి కృషించి పోయేలా చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.ఆ విషయాన్ని బయటకి చెప్పాలి.
దుష్టుల వల్ల నా కూతురు నేను దూరమయ్యాం.మరో జన్మలో మళ్ళీ కలుద్దాం ” అంటూ ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్రాంతి భారతి( Kranti Bharati ) తన తండ్రి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేస్తూ. పవన్ కు మద్దతుగా నిలబడుతున్నారు.

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అంతా నిలబడాలని , ఆయనను పిఠాపురంలో గెలిపించుకోవాలని క్రాంతి భారతి పిలుపునిస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా తన తండ్రి పై విమర్శలు చేస్తూ, పవన్ కు అండగా నిలబడుతూ , తన తండ్రిని సైతం వ్యతిరేకిస్తున్నారుఇటీవలే పవన్ ను కలిసిన ఆమె ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ వేడుకను పంచుకున్నారు.వచ్చే ఎన్నికల్లో భారతీ కి టికెట్ ఇస్తామని పవన్ సైతం హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే తనను తన కుమార్తెను విడదీస్తున్నారని ఆరోస్తూ మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని పవన్ ను ఇరుకును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం.