ఎన్నికల వేళ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం( Macherla Assembly constituency )లో నాటు బాంబుల కలకలం చెలరేగింది.ఈ మేరకు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఓ ఇంటిలో నాటు బాంబులు, వేట కొడవళ్లతో పాటు ఇనుపరాడ్లు కనిపించాయి.
సమాచారం అందుకున్న దుర్గి( Durgi) పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాటు బాంబులను, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.అయితే వీటిని ఎవరు దాచి పెట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో నాటు బాంబులు దొరకడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.