టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Junior NTR, Ram Charan)లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా విడుదల అయ్యి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించింది.ఈ సినిమాతో తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి(rajamouli).
ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ అయినప్పటికీ ఈ సినిమా విషయంలో ఇప్పటికీ చెర్రీ తారక్ అభిమానులు గొడవ పడుతూనే ఉన్నారు.
అందుకు గల కారణం చిత్రంలో రామ్ చరణ్‌తో (Ram Charan)పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)పాత్రలో అంత బలం లేదని, దానికి సరైన ఎలివేషన్ దక్కలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సినిమా విడుదల అయ్యి ఏడాది దాటి పోయినా కూడా ఈ విషయం గురించి ఇప్పటికే చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఈ విషయంలో సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ జరిగింది.
అయితే అందరూ ఆ టాపిక్ గురించి మరిచిపోయారు అనుకుంటున్న క్రమంలో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.తాజాగా రాజమౌళి ఇప్పుడు బాహుబలి: ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఒక ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు.
అక్కడ కూడా సందర్భం చూడకుండా ఈ అంశం మీద ప్రశ్న అడిగి ఆయన్ని అసహనానికి గురి చేశారు మన విలేకరులు.ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో ఒక హీరో పాత్రే ఎలివేట్ అయింది, ఇంకోదానికి ప్రాధాన్యం తగ్గిందనే విమర్శలు వచ్చాయి, దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా.దీనికి రాజమౌళి సమాధానం చెప్పకుండా ఇది సరైన వేదిక కాదు అని ఊరుకున్నారు.ఇలాగే జక్కన్నను ఇరుకున పెట్టేలా మరి కొన్ని ప్రశ్నలను కూడా మన మీడియా ప్రతినిధులు అడిగటంతో వాటికి రాజమౌళి కొంచెం సున్నితంగానే సమాధానాలు ఇచ్చారు.